ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో టెస్టుల్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయ్యాడు.…
జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి సత్తా చాటింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న రెండు పథకాలకు కేంద్ర నుంచి గుర్తింపు లభించింది. టెలీ కన్సల్టేషన్ ద్వారా వైద్య సేవలు అందించడంలో ముందున్న వైద్య ఆరోగ్యశాఖకు జాతీయస్థాయిలో తొలి ర్యాంకు లభించింది. ప్రతిరోజూ టెలీ కన్సల్టేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.3 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో ఏపీకి సంబంధించి సుమారు 70వేల మందికి 27 హబ్స్‌లలో వైద్యుల నుంచి టెలీ కన్సల్టేషన్ ద్వారా…