పలాసలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో గందర గోళం చేసి వైసిపి కార్యకర్తలు, నాయకులను కర్రలతో రక్తం వచ్చేటట్లు చంద్రబాబు కొట్టించారు. మహిళా ఎంపిపి అశ్విని ని దూషించి కొట్టించి చంద్రబాబు వీరంగం సృష్టించారు. పథకాలిచ్చేస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారన్నది చంద్రబాబే.. నేనొస్తే పథకాలు ఆపను మరిన్ని పథకాలు పెంచుతానని చంద్రబాబు అంటున్నాడు..మాట మీద నిలబడనటు వంటి వ్యక్తి చంద్రబాబుకు మొదటి ర్యాంకు ఇవ్వాలన్నారు.
మాట మీద నిలబడనటువంటి వ్యక్తులకు ర్యాంకింగ్ ఇస్తే చంద్రబాబు కు ప్రపంచంలోనే మొట్ట మొదటి ర్యాంకు ఇవ్వాలి..మన ముఖ్యమంత్రి పై టిడిపి వాళ్ళు బురద చల్లి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని దించేయాలని ఒక కుట్ర ,ఒక మాఫియా మాదిరి ప్రయత్నం చేస్తున్నారు.ప్రజల అండ దండలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డే శాశ్వత ముఖ్యమంత్రి.పలాస లో కన్ఫ్యూజన్ జరిగింది. ఒక టిడిపి నాయకుడు మీడియా ముందు కొచ్చి తొడకొట్టడంతో అధికారులు చర్యలకు సిద్ధపడ్డారు. మా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రజలకు ఇబ్బంది ఉండదన్నారు మంత్రి అప్పలరాజు.
పేదలను అడ్డం పెట్టుకుని టిడిపి నాయకులు కోర్టుకు వెళ్లారు. చెరువు గర్భంలో ఇళ్లు కట్టుకుంటే కోర్టులు సమర్థిస్తాయా…? టిడిపి నాయకులను నమ్మి కోర్టులకు వెళ్లిన పేదలకు పొరపాటున వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు..?అనవసర ఆందోళన సృష్టించిన టీడీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని భావిస్తున్నా అన్నారు మంత్రి అప్పలరాజు.
Read Also:Vigilance Raids: ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్ దాడులు.. గుట్టలుగా బయటపడిన నోట్ల కట్టలు