పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. అఘాయిత్యాలపై తప్పుడు ప్రకటనలు చేస్తూ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ప్రధాని మోడీపై సీఎం మమత విరుచుకుపడ్డారు. బొంగావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగా లేదని ప్రధాని మోడీ గుర్తుంచుకోవాలని అన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ మహిళల ఆత్మగౌరవంతో ఆడవద్దని, మా…
సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. పొరుగుదేశం పాకిస్థాన్ తో అణుబాంబులు ఉన్నందున భారత్ ఆ దేశాన్ని గౌరవించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి గురించి ఆలోచించవచ్చు. పాకిస్థాన్‌కు సంబంధించి అయ్యర్ చేసిన ప్రకటనపై వివాదం నెలకొంది.
Train Accident : ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వల్సాద్ ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
Punjab : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను మంచానికి కట్టేసి సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. షాకింగ్ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
మహారాష్ట్ర జలగావ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్‌ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో…
గత గురువారం రాత్రి యూఏఈ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో షార్జా అల్ నహ్దా రెసిడెన్షియల్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై (Gorantla butchaiah chaudhary) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina venugopal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందే బుచ్చయ్య చౌదరి ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.
స్పెయిన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వాలెన్సియాలో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 24 మంది మరణించినట్లు తెలుస్తోంది.