Dubai: షార్జా అగ్నిప్రమాదంలో రెహమాన్ దగ్గర పని చేసిన సౌండ్ ఇంజనీర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత గురువారం రాత్రి యూఏఈ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో షార్జా అల్ నహ్దా రెసిడెన్షియల్ టవర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురు మృతిచెందగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఇటీవలే వివాహమైన ముంబైకి చెందిన నవ వధువు ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్‌గా పని చేసిన మైఖేల్ సత్యదాస్ కూడా ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు సత్యదాస్ సోదరుడు సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని తెలియజేశాడు.

Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
గత గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దాలో 750 అపార్ట్‌మెంట్లతో కూడిన 39 అంతస్తుల టవర్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ముంబైకి చెందిన నవ వధువు మృతి చెందడం.. ఆమె భర్త ప్రాణాలతో కొట్టిమిట్టాడడం హృదయాలను కలిచివేసే సంఘటన. ఇక మైఖేల్ సత్యదాస్ అయితే.. సంగీత దర్శకుడు రెహమాన్‌తో పాటు అనేక మంది కళాకారుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
తన సోదరుడు మైఖేల్ సత్యదాస్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం.. దీన్ని జీర్ణించుకోలేని విషయమని మైఖేల్ సత్యదాస్ సోదరుడు ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో దుఖంతో ఉన్నామని.. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. మైఖేల్ ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉంటాడని ఎక్స్‌లో ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ వ్రాసుకొచ్చాడు. మైఖేల్ సత్యదాస్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో డీహెచ్‌బీ లైవ్‌లో ఉద్యోగిగా ఉన్నాడు. 2022లో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో మైఖేల్ కుటుంబ సభ్యుడయ్యాడని DXB లైవ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్
ముంబైకి చెందిన మహిళ(29)కు ఫిబ్రవరిలోనే వివాహం అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. ఇక ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ మేరకు మృతురాలి స్నేహితుడు సోషల్ మీడియాలో తెలియజేశాడు. అలాగే భారత కాన్సులేట్ జనరల్ కూడా వారి మరణాలను ధృవీకరించింది. పలువురు గాయపడినట్లుగా కూడా పేర్కొంది. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు..’ డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ స్పీచ్..!
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!