Delhi : ఢిల్లీలోని ద్వారకలో అత్తగారు, కోడలు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న భారీ అగ్నిప్రమాదం వెలుగు చూసింది. అయితే ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది.
తనతో మాట్లాడటం మానేసిన మహిళ ఫ్లాట్‌కు నిప్పంటించాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కాగా.. ఆ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ ధకేటా (32) అనే మహిళ ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బర్త్ డే పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడ్డాడని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కెపి యాదవ్ తెలిపారు.
సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైపోయింది. ఫ్లై ఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్.. వాహనం పక్కకు నిలపాలని కారు యజమానికి సూచించాడు. కారు పక్కకు ఆపి కిందకు దిగేలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగగా.. వెంటనే కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా.. నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపై…
మూడు రాజధానులు అని ఏ ఒక్క రాజధాని లేకుండా చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలన చేయడం జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మరోవైపు.. జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ మృతికి కారణం అని రిలయెన్స్ పై దాడులు చేశారు.. రిలయెన్స్ వాళ్ళు వస్తే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ధనిక సీఎం జగన్.. పెద్దవాళ్ళకు,…
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ నకిలీ రెడ్డి కాబట్టే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాడని మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.పుల్లారెడ్డి రామజన్మ భూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరని బైరెడ్డి పేర్కొన్నారు. రెడ్డి తోక పెట్టుకొని కొందరు నకిలీ రెడ్లుగా చలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నుండి ఏపీలో రెండే పోర్టులు ఉండటం బాధాకరమని అన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఎందుకు కొత్తగా ఒక్క పోర్టులకు నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు. కనీసం శంఖుస్థాపన కూడా ఎందుకు చేయలేదన్నది సూటి ప్రశ్న అని అన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని నారా లోకేష్ కి సవాల్ విసిరాను.. కానీ ఆయన రాలేదని తెలిపారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నాకు చాలెంజ్ చేసారు.. మత్స్యకారులకు, ఉత్తరాంధ్రాకు ఏం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు నీకు దమ్ము, సిగ్గు లజ్జా ఉంటే.. మీ నాన్న కొబ్బరికాయ కొట్టిన పోర్టు, హార్పర్ ఇది అని చూపించు అని చాలెంజ్ చేశారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు.
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఇంకా హరీష్ మంత్రి అనుకుంటున్నారు.. మంత్రిలాగా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం మీద వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 1.34 లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా…