ఫిర్యాదు చేసేందుకు వస్తే.. పోలీసులు నిరాకరించారని ఓ వ్యక్తి కోపంతో రగిలిపోయి తహశీల్దార్ వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాగా.. ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ క్రమంలో.. మనస్తాపం చెందిన ఆ మహిళ కొడుకు ప్రభుత్వ వాహనానికి నిప్పుపెట్టాడు. నిందితుడు పృథ్వీరాజ్ గా గుర్తించారు.
హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కార్ల వర్క్‌షాప్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 16 లగ్జరీ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు బూడిదయ్యాయని సమాచారం.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాల తనిఖీలు చేస్తుండగా.. అహ్లాన్ గగర్మండు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. వివాహేతర సంబంధంతో సహజీవనం చేస్తున్న పార్వతి అనే మహిళపై ప్రియుడు మోహన్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది..
చైనాలో భారత్ ఇన్‌ఫ్లుయెనర్స్ ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆమె చర్యను జాత్యహంకారంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆమెపై మండిపడడానికి గల కారణమేంటో ఈ వార్త చదవండి.
సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన SV792 విమానం పాకిస్థాన్‌లోని పెషావర్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్‌లో సమస్య కారణంగా టైర్‌కు మంటలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మీడియా నివేదికల ప్రకారం.. మొత్తం 276 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు.
Fire In Goods Train : ఈ మధ్యకాలంలో రైలుకు సంబంధించిన ప్రమాదాలు తరచుగా వార్తల్లో వింటూనే ఉన్నాము. కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన దారుణ యాక్సిడెంట్లో ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నేడు ఆదివారం జనగామ జిల్లాలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు వ్యాపించాయి. ఓ గూడ్స్ రైలు బొగ్గు లోడుతో ప్రయాణిస్తుంది. ఆగి ఉన్న గూడ్స్…
ప్రజల ఆందోళనలు, నిరసనలతో కెన్యా పార్లమెంట్ పరిసరాలు అట్టుడికింది. పార్లమెంట్లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.
టెక్సాస్‌లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.