హైదరాబాద్లోని నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంసన్ పెయింట్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు.. దట్టమైన పొగలు రావడంతో దగ్గర్లో ఉన్న స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ కంపెనీ సెలవు కావడంతో కార్మికులు ఎవరు లేనట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది వివరాలు తెలియాల్సి ఉంది.