Fire Breaks Out In Running Car: తిరుమలలో కారులో మంటలు చెలరేగిన ఘటన తీవ్ర కలకలం రేపింది.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారు దగ్ధమైంది.. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో భక్తులు పరుగులు తీశారు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.. అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లే.. తిరుమలలో భక్తులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బెంగళూరుకి చెందిన భరత్ కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం కారులో తిరుమలకు వచ్చారు.. మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరిన వారు.. రాత్రి 9:05 గంటలకు తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు.. అయితే, ఆ సమయంలో కారులోంచి పొగలు వస్తుండడం గమనించిన భరత్.. అప్రమత్తమై.. వెంటనే కారులో నుంచి అందరినీ కిందికి దింపేశాడు.. ఇక, క్షణాల్లో మంటలు వ్యాపించాయి.. సమాచారం అందుకోని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.. అయితే, కారులో ప్రయాణించిన భక్తులు సురక్షితంగా ఈ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Read Also: Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టి పైకి ఎగిరిపోయిన పక్షులు.. వీడియో వైరల్