దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలు పాలైనట్లు తెలుస్తోంది. 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపులోకి తెచ్చాయి.
ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లోని ప్రధాన మార్కెట్‌లో సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. 22 అగ్నిమాపక యంత్రాలు పాల్గొన్నాయి.
అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో ఉన్న ఫ్యాక్టరీ ప్రాంగణంలో ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS)కి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ సాయంత్రం 5.25 గంటలకు కాల్ వచ్చిందని చెప్పారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చామని, కూలింగ్ ఆఫ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందిత. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Alipur Fire | 22 Fire tenders reached the spot and fire was extinguished. 3 casualties so far. Search operation underway: Fire Service https://t.co/JOsrp4VZpB pic.twitter.com/VhPma6PDM4
— ANI (@ANI) February 15, 2024
#UPDATE | Three people died in the fire that broke out at the main market of Alipur, Narela: Fire Service https://t.co/bxhIQkMTto
— ANI (@ANI) February 15, 2024