ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లకు ఆమోదం తెల్పనున్న కేబినెట్ ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఏపీ సీఈఓ సమావేశం.. ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ.. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించే అవకాశం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి.. అమ్మవారికి బోనాలు సమర్పించనున్న భక్తులు నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4వ రోజుకు చేరుకున్న వైసీపీ…
మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్‌లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్..…
వైష్ణవి హత్య కేసులో వీడని సస్పెన్స్: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్.. 10:40 గంటలకు లోకేశ్ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య…
నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్.. ఉదయం 11 గంటలకు రైతు సమస్యలు, అక్రమ అరెస్టులు, పర్యటనలపై ఆంక్షలు వంటి వాటిపై జగన్ మాట్లాడే అవకాశం ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ప్రక్రియ.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఉప ఎన్నిక ప్రక్రియ.. ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో వైసీపీ ఎంపీటీసీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో పర్యటించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది.. 5 కోట్ల రూపాయల నిధులతో పలు…
ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్‌కు భారీ ధర దక్కింది. రూ.11.5…
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి: అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు…
ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు నేడు కాకినాడకి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ.. రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థినులతో మాట్లాడనున్న శైలజ.. నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలు చేసిన 50 మంది విద్యార్థినులు ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30…
Kollywood : నిత్యామీనన్ ఇక నుండి తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించేట్లు కనిపిస్తోంది. బీమ్లానాయక్, శ్రీమతి కుమారితో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరంగా ఉన్న మేడమ్.. తిరుచిత్రాంబలం డబ్బింగ్ వర్షన్ తిరుతో హాయ్ చెప్పింది. తెలుగులో ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయని భామ మరోసారి తమిళ్ మూవీతోనే పలకరించనుంది. తలైవన్ తలైవిని తెలుగులోకి సార్ మేడమ్‌తో డబ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఇడ్లీ కడాయ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ర్యాపోకు రెడీ అయ్యింది…
Kollywood : బిచ్చగాడు సిరీస్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు ప్రముఖ కంపోజర్ విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా నటించిన మూవీ మార్గాన్.. జూన్ 27న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న బిచ్చగాడు 3ని 2027 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు. Hollywood : మార్వెల్ స్టూడియోస్ నుండి…
Tollywood : మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప. శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా రేపు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు 1st Day అడ్వాన్స్ సేల్స్ చూస్తే ఆల్ ఇండియా – 1,473 షోస్ కు గాను రూ. 1.66కోట్లు , 17.19% ఆక్యుపెన్సీ కలిగి ఉంది. ఏపీలో…