Kollywood : బిచ్చగాడు సిరీస్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు ప్రముఖ కంపోజర్ విజయ్ ఆంటోనీ. ఆయన హీరోగా నటించిన మూవీ మార్గాన్.. జూన్ 27న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న బిచ్చగాడు 3ని 2027 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు.
Hollywood : మార్వెల్ స్టూడియోస్ నుండి సూపర్ హీరోస్ ఫిల్మ్స్‌కు హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియా వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పడు ఈ స్టూడియో నుండి ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్ రాబోతోంది. జులై 25న హాయ్ చెప్పబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజౌవుతుండగా.. ఇండియాలో పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. రీసెంట్లీ ఈ సినిమా నుండి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Bollywood : రైడ్ 2తో హిట్ ట్రాక్ ఎక్కిన అజయ్ దేవగన్ నుండి వస్తోన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సన్నాఫ్ సర్దార్ 2. 2012లో వచ్చిన సన్నాప్ సర్దార్ సీక్వెల్. కాగా, ఇది 2010లో వచ్చిన రాజమౌళి హిట్ మూవీ మర్యాద రామన్నకు రీమేక్. హిందీలో కూడా మంచి వసూళ్లను సాధించింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు అజయ్. విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన ఈ బొమ్మ జులై 25న ప్రేక్షకులను పలకరించబోతుంది. అజయ్ దేవగన్ సరసన సీతామహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. రీసెంట్లీ ఈ మూవీ నుండి ఎనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.