ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విజయేంద్రప్రసాద్…