టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ).