Minister Narayana: రాజధాని అమరావతికి రైల్వేలైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మంత్రి నారాయణ.. రైతుల డిమాండ్లు, విజ్ఞప్తులను విన్న ఆయన.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.. ఈ సమావేశానికి పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు హాజరయ్యారు.. అయితే, అమరావతి మీదుగా వెళ్లే కొత్త రైల్వే లైన్ పరిధిలో ఉన్న ఆయా గ్రామాల రైతులు.. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. రాజధానిని అనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని కోరారు.. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి నారాయణ. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు..
Read Also: Brand Market: బాలీవుడ్ స్టార్లను మించిపోయిన భారత క్రికెటర్లు.. కోహ్లీ, ధోనీ, సచిన్ టాప్ త్రీ
మరోవైపు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.. సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు హాజరయ్యారు.. వీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనుల పూర్తి, టౌన్ ప్లానింగ్ అంశాలపై చర్చించారు.. నగర పాలక సంస్థలోని అన్ని విభాగాల పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అధికారులు. నగర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి నారాయణ.