Ponnam Prabhakar: రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారు.. ఆదాయం వచ్చే పంటలు వేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉంటే మాకు అధికారంలోకి వచ్చేటప్పటికి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. ఎక్కడ భూములు అమ్మకుండా ఇబ్బందులు పెట్టకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు ఆర్టీసీ ఉచిత బస్సు,10 లక్షల ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల విద్యుత్ ,500 కి గ్యాస్ అందిస్తున్నామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు.
Read also: Mechanic Rocky : ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘మెకానిక్ రాకీ’
రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ అయింది… 2 లక్షల పైన ఉన్న వారికి 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వడ్ల కొనుగోలు లో దిఫాల్టర్ లేని వాళ్ళ నుండి ఇబ్బందులు లేవు.. వడ్ల కొనుగోలు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. డిఫాల్టర్ లకు ధాన్యం ఇవ్వందం లేదు మీరు గత బకాయిలు చెల్లించాలన్నారు. మీరు డి ఫాల్టర్ నుండి రెగ్యులర్ గా రైతు ల దగ్గర ధాన్యం తీసుకోవాలని తెలిపారు. రైతులు కొనుగోలు చేసిన ధాన్యం కొంత ఇబ్బంది అయిందన్నారు. సన్న ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులు సన్న ధాన్యం పండిస్తున్నారని అన్నారు. ఆదాయం వచ్చే పంటలు వేయాలన్నారు. ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ఇ వరంగల్ లో మహిళా సదస్సు ద్వార పెద్ద కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈనెల 20న వేములవాడలో దర్శనం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు. చివరి వారంలో మహబూబ్ నగర్ లో రైతు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
Read also: CM Chandrababu in Delhi: హస్తినలో ఏపీ సీఎం బిజీబిజీ
ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలన్నారు. అధికారులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అభిప్రాయాన్ని అడుగుతున్నారన్నారు. మేము ఎక్కడ నియంతృత్వంగా వ్యవహరించడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతి లో వ్యవహరిస్తున్నం… గతంలో మీరు సభ ను కూడా నడిపించలేదు.. మేము తెల్లవార్లూ వరకు నడిపించామన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయి ఉండి అధికారి నీ కొట్టడం తప్పే..కానీ అరెస్టు చేస్తారా అంటున్నారు..? అని మండిపడ్డారు. సర్వే లో ఎక్కడ ఇబ్బందులు లేవు..సజావుగా సాగుతుందన్నారు. ఇది ఎక్స్ రే లాగ సామాజిక రుగ్మతలు తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. నేను కేంద్ర మంత్రి బండి సంజయ్ లాగ అరెస్టు చేస్తం..జైల్లో పెడుతున్నాం అని చెప్పడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధి బోర్డు ఉంది.. అథారిటీ ఉన్నప్పుడు ట్రస్ట్ వేయడానికి లేదన్నారు. న్యాయ పరంగా ఆలోచన చేస్తున్నామన్నారు. దక్షిణ కాశీ పెద భక్తులు అధికంగా వస్తారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తో వస్తున్నారు.. ప్రజలు స్వాగతించాలన్నారు.
Deputy CM Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్.. రెండు రోజుల షెడ్యుల్ ఇదే..