రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.. పసుపు, మిరప ఉత్పత్తులలో దేశం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సిటి ఆర్ఐ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది.. టూబాకో నిషేధం కొనసాగుతున్నందున ఇతర పంటలపై పరిశోధనలు చేయాలని సూచించారు..
నూతన సంవత్సరం వేళ అన్నదాతల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.1350కే 50 కిలోల డీఏపీ ఎరువు బస్తా అందజేయాలని నిర్ణయం తీసుకుంది. డీఏపీ ఎరువులపై అదనపు భారం కేంద్రమే భరించాలని నిర్ణయం తీసుకుంది.
రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా పర్యటనలో ఆయన రైతుభరోసా కేంద్రం ప్రారంభించారు.. అనంతరం రైసు మిల్లును కూడా పరిశీలించి, ధాన్యం సేకరణపై రైతులతో మాట్లాడారు.. అక్కడ రైతులకు టెక్నాలజీపై ఉన్న అనుభవం అడిగి తెలుసుకున్నారు.. ఫోన్ లో మెసేజ్ లు చదవడం పై రైతుల అవగాహన ఏ పాటిదో అడిగి తెలుసుకున్నారు.. ధాన్యం సేకరణపైన ప్రత్యేక దృష్టి సారించారు..
డబ్బులు సంపాదించడం ప్రతి వ్యక్తి కోరిక. దాని కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి కష్టపడకుండానే డబ్బు పొందుతారు. ఓ రైతు విషయంలో కూడా అదే జరిగింది. రూ.287 కోట్ల విలువైన లాటరీ తగిలింది. కానీ.. ఆయన సంతోషించే లోపే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందటే..
Minister Seethakka : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఆలయ పాలక వర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిగి ,కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ రైతు వ్యవసాయ మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని అన్నారు. అదేవిధంగా పేదింటి బిడ్డలు సన్న…
పంజాబ్-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు యత్నిస్తున్నారు. రైతులపై పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల 17 మంది రైతులు గాయపడ్డారు. ఆ తర్వాత తోటి రైతులు గాయపడిన వాళ్లను స్ట్రెచర్లపై ఆస్పత్రికి తరించారు. కాగా.. ప్రస్తుతం 101 మంది రైతుల బృందం ఢిల్లీ మార్చ్‌ను విరమించుకుంది. మరోవైపు అంబాలాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని హర్యానా…
KTR : తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చే ప్రభుత్వం నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అస్థిత్వంపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్య తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తుందని, ప్రజల ఆవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను శాసనసభ, మండలిలో నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరతను ప్రశ్నిస్తూ, సర్పంచులు, మాజీ సర్పంచులకు బిల్లుల…
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల 'జాతా' ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.