వ్యవసాయం పై ఈరోజు తెలంగాణ కేబినెట్ లో చర్చించారు. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై… పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. ఇక రుణ మాఫీ పై కేబినెట్ లో చర్చిస్తూ… రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. అయితే, రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా హర్యానాలో వంద మంది రైతులపై ఏకంగా దేశద్రోహం అభియోగాలు మోపడం సంచలనంగా మారింది.. ఇంతకీ వీరు చేసిన దేశద్రోహం ఏంటంటే.. హర్యానా డిప్యూటీ స్పీకర్, బీజేపీ నేత రణబీర్ గంగ్వా వాహనంపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడమే.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 11న…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతుల కూడా ఎంట్రీ ఇచ్చారు.. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకెక్కారు ఏపీ రైతులు.. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా…
గుంటూరు : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని సెగ తగిలింది. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవిని…కొందరు దళిత మహిళ రైతులు, రైతులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో.. ఆ దళిత రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందడం నూతన సచివాలయం ప్రారంభోత్సం నుంచి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెళ్ళాక.. ఆ రైతులను పోలీసులు వదిలిపెట్టారు. అయితే.. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రైతులు. రాజధాని రైతుల…
దేశంలో అడ్డూ-అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఇంధన ధరలపై రైతు సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ఈ నెల 8న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపనున్నారు రైతులు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. ఖాళీ గ్యాస్ సిలెండర్లతో నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘూ…
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బి.ఆర్. కె.ఆర్ భవన్ లో SLBC 29 వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ను ఆమోదించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని, ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7360…
రైతులకు పంట పెట్టుబడి సాయానికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు సీఎం కేసీఆర్.. ప్రతీ పంటకు రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి క్రమంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండగా.. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని.. మిగిలిపోయిన…
కరోనా కష్టసమయంలోనూ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం… రైతులకు పంటసాయంగా రైతు బంధు పథకం కింద ఇచ్చే సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ చేసినట్టు ప్రకటించింది కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. ఇవాళ ఒకేరోజు 2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02 లక్షల ఎకరాలకు గాను రూ.651.07 కోట్లు జమ అయ్యాయని.. ఇప్పటి వరకు మొత్తం 133.27…
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు అండగా ఉంటూ రైతు బంధు పథకం కింద పంట సాయాన్ని అందిస్తోంది.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది సర్కార్.. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశామని.. మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ. 1153.50 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు అధికారులు.. ఇక, నాలుగో రోజులో భాగంగా రేపు…
కరోనా కష్టకాలంలోనూ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి రైతులకు పంట సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు రైతు బంధు పేరుతో ఆర్థిక భరోసి ఇస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా… రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జమచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. రెండవ రోజు 15.07 లక్షల మంది రైతుల ఖాతాలలో…