రైతులు వాణిజ్య పంటల సాగుపై దృష్టి పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు మల్లాల్సిన అవసరం ఉందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. కాగా, ఈరోజు సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జీ వి కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో కంపెనీకి చెందిన సత్యనారాయణ ఆయిల్ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారడంతో పాటు, వేలాది మందికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీల్లో ఉపాధి లభిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ కి సుప్రసిద్ధమైన మలేషియా దేశంలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్ఫామ్ సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాల పైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని ఆహ్వానించారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటించి ఆయిల్ ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లతో పాటు మరికొన్ని చోట్ల రాష్ట్రంలో ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, సిరిసిల్లలో ఫ్యాక్టరీ తో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ , ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీ ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టుతో చాలా ప్రాంతాలకు నీటి లభ్యత పెరిగింది.. నీరు ఉండడంతో.. అంతా వరిసాగువైపే మొగ్గుచూపకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!