Farmers worried: వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers worried: తెలంగాణలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు రైతన్నల్లు లబోదిబో మంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన వేరుశనగ, కల్లాల్లో మిర్చి పంటల అకాల వర్షాలకు తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇలా పంటలు తడవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పంటలు తడిస్తే ఎవరు కొనుగోలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు రోజుల పాటు వానలు పడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు.
జగిత్యాల..
Also Read
జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ చౌరస్తా, ధరూర్ క్యాంప్, విద్యానగర్ , ఉస్మాన్ పుర,ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాయికల్ , సారంగాపూర్ , బీర్పూర్ పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొడిమ్యల మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది.
సంగారెడ్డి..
సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మునిపల్లిలో మామిడి రాలిపోయింది. న్యాల్ కల్ లో వడగండ్లకి పుచ్చకాయ పంట ధ్వంసం అయ్యింది. మళ్ళీ వర్షం వస్తుండటంతో అన్నదాతలు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. వానలకు పలు గ్రామాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఐజ, మానవపాడు మండలాల్లో కల్లాల లోని మిర్చి తడిసి ముద్దైంది.దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గద్వాల మార్కెట్ యార్డ్ లో వర్షపు నీటికి అమ్మకానికి తెచ్చిన వేరుశనగ కొట్టుకుపోవడంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు.
మెదక్..
ఉమ్మడి మెదక్ జిల్లాలో వాన ముసురుకుంది. చాలా చోట్ల ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్నటి వడగళ్ల వానతో చాలా చోట్ల పంటలు పాడై పోయాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. అప్పులు చేసి పంటలు వేశామని ఇప్పుడు ఆకాల వర్షాలకు పంటలు దబ్బుతిని, నీట మునిగాయంటూ.. వాపోతున్నారు.
నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో.. నేడు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించింది. జిల్లాలోని ఆర్ముర్,బాల్కొండ మెండోరా,వేల్పూర్ ముప్కాల్, మండలాల్లో మొక్క జొన్న తడిసి పోయింది. వర్ష సూచనతో పసుపు కొనుగోళ్లు నిలిపి వేశారు అధికారులు. దీంతో.. వరుస సెలవులతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో ట్రాక్టర్ల పై విరిగిపడ్డ చెట్లు రెండు ట్రాక్టర్ల ఇంజన్లు ద్వంసమయ్యాయి. మండలంలోని మాదాపూర్ గ్రామంలో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నెలకొరిగింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!