KTR Tweet: ధాన్యం కొలుగోలు విషయం పై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది. నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు అంటూ ట్వీట్ చేశారు. పెళ్లిళ్లలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతన్న నడ్డివిరిచి గాల్లో విహరిస్తున్న మోసకారి కాంగ్రెస్ అని మండిపడ్డారు. దసరా పోయింది, దీపావళి పోయింది, కార్తీకమసమొచ్చినా ధ్యానం కొనుగోళ్లు మాత్రం కానరావడం లేదన్నారు. నాడు గింజగింజకు కేసీఆర్ హామీ – నేడు గడియగడియ గండమే అంటూ ట్విటర్ వేదికగా ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. మిల్లర్లతో చర్చలు లేవు – రైతుకు భరోసా కరువు- అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్ అంటూ మండిపడ్డారు. ధాన్యం కొంటే 500 బోనస్ – అసలు కొనకుంటే అంతా బోగస్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమీక్ష లేదు – సమావేశం లేదు – ధాన్యం పై కప్పే కవర్లు లేవు – అసలు సమయమే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ లేదు – రైతు బంధు లేదు – రైతు భీమా లేదు – చివరకు పంట కొనుగోళ్లు లేవన్నారు. లేవు లేవు లేవు అసలేమీ లేవు ఈ అసమర్థపు సన్నాసి పాలనలో ఏమిలేవు అని ట్విటర్ వేదికగా కేటీఆర్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
Kaleshwaram: కాళేశ్వరంలో కమ్మేసిన పొగమంచు.. భక్తులు తీవ్ర ఇబ్బందులు..