ఏపీలో 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1న ప్రారంభమైన ఈ పాదయాత్రం ఈ నెల 15న ముగియనుంది. 45 రోజుల పాటు సాగనున్న రైతుల పాదయాత్ర తిరుమలలో ముగిసే విధంగా ప్రణాళికను సిద్దం చేశారు. అయితే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా ప్రజలు, రైతులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే తాజాగా రైతుల పాదయాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని వారి సంఘీభావాన్ని రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలపై రైతులు మోడీ నడ్డి విరిచారన్నారు. అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమని, పాలనా వికేంద్రీకరణ పేరుతో రాజ్యాంగ ఉల్లంఘన చేశారన్నారు. ఇప్పటికైనా జగన్ రైతు ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలని, మొండి పట్టు వీడాలని వారు అన్నారు. అంతేకాకుండా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ తొలి విజయమని, తిరుపతిలో 17న బహిరంగ సభ నిర్వహించి తీరుతామన్నారు.