దేశానికి వెన్నెముక రైతన్న.. రైతులకు పెద్దపీట అంటూ ఎన్నికల్లో వాగ్దానం చేయడం …గద్దెనెక్కాక దేశానికే వెన్నెముక అయిన రైతు వెన్నెముక విరిచేయడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. స్వతంత్రం వచ్చిననాటి నుంచి రైతన్న పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలేగాని రైతన్నకు పేరుతెచ్చిన దాఖలాలు లేవు. దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా మట్టిని నమ్ముకున్న రైతులు ఆఖరికి ఆ మట్టిలోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పడంలో ఆతిశయోక్తి లేదు. గత ఎన్నికల్లో రైతులను సంపన్నులను…
న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతిలో రైతులు సాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ఉద్యమం రైతులది కాదు. టీడీపీ కార్యకర్తలదే అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చెరకు రైతులకు బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని, ఎన్‌సిఎస్ సుగర్స్‌కు చెందిన 24 ఎకరాలను వేలం వేసి ఆ సొమ్ముతో బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌సిఎస్ సుగర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తాం. ఫ్యాక్టరీ భూములను విక్రయించి, రైతుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తాం. రూ.10కోట్లు విలువైన పంచదారను…
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి అభివృద్ధికి తమ భూములు ఇచ్చిన రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి 45 రోజుల పాటు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నవారు రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా నిలువాలన్నారు. రాజధానికి కాపాడుకోకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో…
ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దులలోని నిరసన ప్రదేశాల నుండి బారికేడ్లను తొలగించిన తరువాత, రైతులను అక్కడి నుండి పంపిచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వెలుపల దీపావళి చేసుకుంటారని రైతు సంఘాల నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని ఆదివారం హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లో ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో రైతుల నిరసన స్థలాల నుండి బారికేడ్లు, ముళ్ల వైర్లను తొలగించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న…
హర్యానాలో రైతులు..భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, జజ్జర్‌లో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతులను ఆపడానికి నీటి ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. అయితే… నల్ల జెండాలతో రైతులు ముందుకే సాగిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు-రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల దగ్గర నెలల తరబడి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక..ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు తమ విధులకు…
అమరావతి. ఆంధ్రుల ఆశాకిరణంగా నిలిచిన నగరం. నిలుస్తుందని అనుకున్న పట్టణం. కానీ.. రాజకీయాల్లో చిక్కుకుని.. భవిష్యత్తు ఏంటో తెలియక సతమతమవుతున్న నగరం. ఇందులో.. ఎవరినీ తప్పుబట్టడం కానీ.. మంచి అనడం కానీ.. ఎంత మాత్రం లేదు. కానీ.. లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో తెలియక.. నిత్యం అక్కడ దీక్షల పేరుతో పోరాటాన్ని కొనసాగిస్తున్న రైతుల భవిష్యత్తు ఏంటి.. అన్నదే ఇక్కడ చర్చనీయాంశం. గతంలో టీడీపీ ఉన్నప్పుడు భూములు సేకరించింది. అమరావతిపై ప్రజలు ఆశ్చర్యపోయే రీతిలో ప్రచారం చేసింది. దేశానికే…
విశాఖ,దేవరాపల్లి, హాల్ సేల్ యగూరలు మార్కెట్ లో గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసారు రైతులు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపీ కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిర్సన తెలిపారు రైతులు. దళారీ బారినుండి కాపా డాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాడేరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డు కోని స్థానిక వ్యపారులు సిండికేట్ కా ఎర్పడి రైతులను మోసంచేస్తున్నారు వ్యపారులు. గత ఆరవైసంవత్సరాలు నుండి దేవరాపల్లి…
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే “సంయుక్త కిసాన్ మోర్చా”, “కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ” కు చెందిన 200 మంది గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ధర్నా చేయటానికి అనుమతి ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చారు. జూలై 22 నుండి ఆగష్టు 9…
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లకు మద్దతుగా ఆ ర్యాలీలో ఉద్యమాల సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసిన.. రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్. నారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు…
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం లోడ్ కోసం వచ్చిన లారీని అడ్డుకున్నారు రైతులు. సన్నరకం ధాన్యాన్ని కాంటాలు పెట్టకుండా దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేయించేందుకు వచ్చిన అధికారులతో పాటు లారీని అడ్డుకున్నారు రైతులు. లారీ టైర్ కింద పడుకుని నిరసన వ్యక్తం చేసారు ఓ రైతు. వెంటనే సన్నరకం ధాన్యం కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారిపై…