Nadendla Manohar : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాయల్ కన్వెన్షన్ హల్‌లో జరిగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఇటీవల మరణించిన బాధిత కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నాదెండ్ల మనోహర్ రాజానగరం చేరుకున్నారు. ముందుగా మధురపూడి ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుండి రాజానగరం చేరుకున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక…
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరోవైపు బీఆర్‌ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు.
గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రిమాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత…
రుణమాఫీ చేస్తానని, రైతుబంధు పెంచి ఇస్తానని వాగ్దానాలన్నీ చేసి, ఇవ్వాళ పెంచిన రైతు భరోసా కాదుకదా ఉన్న రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వమన్నారని పార్లమెంట్ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.. రైతుల అప్పుల్లో కూడా మన రాష్ట్రానిదే అగ్రస్థానమే అని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయ రంగంపై వేల కోట్ల ఖర్చు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది.. సీఎం వైఎస్ జగన్ వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి రైతుల కష్టాలపై దృష్టి సారించాలన్న ఆయన.. సీఎం జగన్ పొలం బాట పడితే రైతుల కష్టాలు తెలుస్తాయి అన్నారు
Monkey: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులు భిన్నమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువులతో ప్రజలు ఆగమాగమవుతున్నారు.