తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న శక్తులు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ శక్తులే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. దేశంలో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. డబ్బను పుట్టించడం మళ్లీ ఆ డబ్బును ఖర్చు అయ్యేలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మెరగుపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయం ద్వారానే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేశారని అన్నారు. రూ. 2 కిలో బియ్యం…
వివిధ సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వరుసగా లేఖలు రాస్తూ వస్తున్న టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… ఇవాళ మరో బహిరంగలేఖ రాశారు.. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం గురించి లేఖలో పేర్కొన్నారు.. సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో, రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తదితర సమస్యల నేపథ్యంలో రైతు అప్పుల పాలై దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లిన రేవంత్.. రాష్ట్రంలో మిర్చి, పత్తి…
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది. ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13…