Harish Rao : వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు
- రేవంత్ రెడ్డి రైతులను రోడ్డున పడేశారు
- రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కే లేదు
- పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు
- కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెలరోజులైనా కొనే నాథుడే లేడు
- బోనస్ ఇవ్వరు.. రైతు బంధు ఇవ్వరు : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడి వడ్లని 1800 కి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని, మొక్కజొన్న కొనే నాధుడే లేడని హరీష్ రావు అన్నారు. వర్షాలకు చాలా చోట్ల తడిశాయి…వాటిని వెంటనే కొనుగోలు చేయాలని, ఒక్క రోజైన ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. రైతుల కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతు బంధు 15 వేలు ఇస్తామని చెప్పి ఉన్న రైతుబంధు కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా 22 లక్షల మందికి తెలంగాణలో రుణమాఫీ కాలేదని, రుణమాఫీపై ఎన్నో కొర్రీలు పెట్టి 100 కారణాలు చెబుతున్నారన్నారు హరీష్ రావు. రైతులకు రైతుబంధు ఇవ్వడానికి డబ్బులు లేవు అంటారని, లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి సుందరికరణ ఎలా చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్, మంత్రులు ఇప్పటికైనా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకి రావాలని, రైతుల సమస్యల్ని పట్టించుకోని పరిష్కరించాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు హరీష్ రావు.
Delhi: ఘోరం.. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్ (వీడియో)
Also Read
ఇదేకాకుండా..’ఆదిలాబాద్ లో సోయాబీన్ రైతులకు రెండు నెలలైన డబ్బులు ఇవ్వట్లేదు. సిద్దిపేటలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలెక్కువ చేతలు తక్కువ. కరోనా ఉన్న, ఎంత కష్టం వచ్చినా మంత్రుల జీతాలు ఆపారు కానీ రైతుబంధు ఆపలేదు. పత్తి రైతులు ఆగమైపోయారు. గతేడాది కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని కొన్నాడో మీరిప్పుడు ఎన్ని కొన్నారో లెక్కలు చెప్పాలి. ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోతే రోడ్డెకాల్సి వస్తుంది. రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు.’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Bhatti Vikramarka : భవిష్యత్తులో విద్యుత్‌కు ఇబ్బంది రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!