ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
Rs 1 lakh power bill shocks Poor Farmer Family in AP: సాధారణంగా గ్రామాల్లో కరెంట్ బిల్లు రూ. 300-500 దాటదు. రెండు బల్బులు, ఓ ఫ్యాన్ ఉండే ఇంట్లో మరింత తక్కువగా వస్తుంటుంది. పేద రైతుల ఇంట్లో అయితే రూ. 200 కూడా రాదు. ఎందుకంటే.. ఉదయం అంతటా పనుల కోసం పొలానికి వెళ్లే వారు రాత్రి మాత్రమే కరెంట్ వాడుతుంటారు. అయితే ఓ పేద రైతుకు భారీగా కరెంట్ బిల్లు వచ్చింది.…
Fertiliser, Labour Cost Hike: ఆగస్టులో వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు పెరుగుతున్న కూలీ ఖర్చులు వ్యవసాయాన్ని మరింత కష్టతరం చేశాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి.
Farmer Arrested For Killing Tigers with Poison : తన ఆవును చంపేసిందని పులిపై ప్రతీకారం తీర్చకున్నాడు ఓ రైతు. ఈ ఘటన తమిళనాడులోని నీల్‌గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం ఓ రైతు ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లింది. అయితే అది ఎంతకీ తిరిగి రాకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ ఆ రైతే అడవికి వెళ్లాడు. అక్కడ అతడికి చనిపోయిన తన ఆవు కనిపించింది. అది చూడగానే ఆ రైతు దు:ఖం…
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఇవాళ (సోమవారం) ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
ఆపరేషన్‌కు సాయం చేయమని అడగడానికి ఒక రైతు తన నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాడు. తానే డాక్టర్ కావడంతో.. తను ఆర్థిక సాయం చేయడం కంటే.. తానే స్వయంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కారం చేయాలని భావించాడు.
విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.