Uttar Pradesh: జూదగాళ్ల ఆచూకీ చెప్పాలని రైతును చితకబాదిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. వారిపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఆ తర్వాత మృతుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ ఘటన సర్దార్ నగర్‌లో చోటుచేసుకుంది.
Read Also: World Cup 2023: సెమీస్లో తలపడే జట్లు ఇవే.. ఇండియాతో ఆ జట్టు పోటీ
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
వివరాల్లోకి వెళ్తే.. ఓ రైతు తన పొలం నుండి తిరిగి వస్తుండగా.. అదే మార్గంలో ఒకచోట కొందరు జూదం ఆడుతున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో జూదరులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ క్రమంలో అటునుంచి వస్తున్న రైతును పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడే తీవ్ర గాయాలతో పడిపోయాడు. అయితే ఆ రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో వారు అతనికోసం వెతకగా.. పొలంలో గాయపడి పడి ఉన్నాడు. జరిగిన విషయాన్ని మొత్తం మృతుడు కుటుంబీలకు చెప్పాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబీకులు పోలీసులపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారు.
Read Also: Viral Video: బ్యాట్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న బ్యాట్స్మెన్లు.. వీడియో వైరల్
పొలం నుంచి తిరిగి వస్తున్న తన అన్నను పోలీసులు పట్టుకుని జూదం ఆడేవారి పేర్లు చెప్పాలని బెదిరించారని మృతుడి సోదరుడు తెలిపాడు. వారి పేర్లు చెప్పడానికి నిరాకరించడంతో పోలీసులు తీవ్రంగా కొట్టారని అన్నాడు. దీంతో తల, ఛాతి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయని.. పరిస్థితి విషమంగా ఉండడంతో బరేలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పాడు.
- Tags
- cime news
- died
- farmer
- police
- telugu news
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!