కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 10 ఎకరాలు మిరప పంటను ధ్వంసం చేశాడు రైతు షఫీ. మిరప పంటపై 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే.. మూడు కోతలకు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగో కోతకు ధర పడిపోయిందని.. దీంతో గిట్టుబాట ధర రాక పంట తొలగించానని రైతు చెబుతున్నాడు.
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బోరు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మునగాల మండలం కలుకోవా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు కొమర్రాజు లక్ష్మయ్య అనే రైతుగా గుర్తించారు. బోరు బావిలో మోటార్ను దించేందుకు లోపలి దిగడంతో ప్రమాదవశాత్తు ఊపిరి అందక మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో నిమ్మచెట్ల నరికివేతను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
బ్యాంకు అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారు ఒక రైతుపొలంలో ప్లెక్సీలు కట్టడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.
రైతే రాజు అని చెబుతుంటే వింటుంటాం. ఓ వీడియోలో ప్రత్యక్షంగా చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పశువులకు మోత తీసుకెళ్లేందుకు సాధారణంగా రైతులు ఎద్దులబండి, రిక్షాలు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పోర్షే లగ్జరీ కారులో పశువులకు గడ్డి తరలిస్తున్న ఓ మహిళ రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Komaram Bheem: కొమురం భీం జిల్లాలో సంచారం చేస్తూ అందరిని హడలెత్తించిన ఏనుగు ఎట్టకేలకు సరిహద్దు దాటింది. 53 గంటల పాటు తిరుగుతూ ప్రతి ఒక్కరికి నిద్రలేకుండా దడ పుట్టించింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు దాడికి మరో రైతు బలైపోయాడు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య అనే రైతు వ్యవసాయ పనుల కోసం పంట పొలంలోని కరెంటు మోటార్ వేయడానికి ఇవాళ (గురువారం) ఉదయం వెళ్లే క్రమంలో ఏనుగు ఒక్క సారిగా దాడి చేయడంతో.. పోచయ్య అక్కడికక్కడే మృతి చెందారు.
Guntur : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి.
రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.