కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో ఓ రైతు ధాన్యం కుప్పపైనే ప్రాణాలు వదిలాడు. లింగంపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం అవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మానసిక వత్తిడితో అనారోగ్యం పాలవుతున్నారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతు బీరయ్య వుండిపోయాడు. దీంతో మానసిక వత్తిడి ఎక్కువయింది. దీనికి తోడు రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్ళు ఆలస్యం…
పంట పొలాలపై నిత్యం పక్షులు దాడిచేసి పంటను తినేస్తుంటాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి పొలంలో రైతులు దిష్టిబొమ్మలు, ఎర్రని గుడ్డలు వంటిని ఏర్పాటు చేస్తుంటారు. లేదంటే డప్పులతో సౌండ్ చేస్తుంటారు. అయితే, 24 గంటలు పొలంలో ఉండి వాటిని తరిమేయాలి అంటే చాలా కష్టం. దీనికోసం ఓ రైతు వేసిన పాచిక పారింది. పక్షులు పరార్ అయ్యాయి. ఆ ఐడియా ఏంటో ఇప్పుడు చూద్దాం. మాములు ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ తీసుకొని దాని రెక్కలు తొలగించాడు.…
ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు,…
సకాలంలో వర్షాలు కురవకపోవడం వలన పంటను పండించలేరు. అదే విధంగా భారీ వర్షాలు వరదల కారణంగా కూడా పంటకు నష్టం వస్తుంది. ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంది. ఈ పరిహారం కోసం రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరగాలి. డబ్బులు చెల్లించాలి. వచ్చిన మొత్తంలో కొంత సమర్పిస్తేనే పనులు ముందుకు సాగుతాయి. అయితే, హర్యానాలో ఓ రైతుకు వింత సమస్య వచ్చిపడింది. తనకు 20 ఎకరాల పంటపోలం ఉన్నది.…
చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఉన్నాడు ఓ వృద్ధుడు. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ వార్త విన్న గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రెడ్యాకు ఫోన్ చేసి భరోసా కల్పించారు. రెడ్యాతో ఫోన్ లో మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కల్పిస్తామన్నారు.…
కరోనా దెబ్బతో ఏదైనా పనిచేసుకుందామన్న దొరకని పరిస్థితి.. వ్యవసాయం చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరాని దుస్థితి.. ఖాళీగా ఉండలేక వ్యవసాయం చేద్దామంటే ఎద్దులు లేకపోవడం ఓవైపు అయితే.. మరోవైపు ట్రాక్టర్‌ను పెట్టి దున్నించడానికి డబ్బు కూడా లేదు.. ఈ సమయంలో.. ఆ రైతు మెదడుకు వినూత్నమైన ఆలోచన తట్టింది.. తన పాత సైకిల్‌తోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.. ఔరా..! అనిపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా దెబ్బకు…
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది ఏపీ సర్కార్. మునుపెన్నడూ లేని విధంగా సామాన్య ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు యజమానులుగా ఉన్న రైతులకు మాత్రమే అందుతున్న భరోసా.. కౌలు రైతులకు అందనుంది. ఏపీ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం భూములు కౌలు రైతుల…
కర్నూల్ జిల్లాలో రైతులకు విలువైన వజ్రాలు దొరుకుతున్నాయి. జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతంలో వజ్రాలు లభిస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ వజ్రాలు దొరుకుతున్నాయి. ఇందులో భాగంగానే ఆ జిల్లాలోని ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. చిన్న జొన్నగిరిలో పొలంలో పని చేసుకుంటుండగా ఆ రైతుకు ఈ విలువైన వజ్రం దొరికింది. ఈ వజ్రం ఏకంగా కోటి 25 లక్షలు పలికింది. వేలంలో భాగంగా వజ్రాన్ని కొనుగోలు చేశారు గుత్తి…
ఖరీఫ్-2020లో నష్టపోయిన పంటలకు నేడు వైఎస్ఆర్ పంటల బీమా కింద సాయం అందించనుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగా 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,820.23 కోట్లు జమ చేయనుంది ఏపీ సర్కార్. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎం కార్యాలయం నుంచి సిఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే యాస్ తుఫాన్ కారణంగా నేటి పంటల భీమా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు ఉత్తరాంధ్ర…