Rahul Gandhi: ప్రభుత్వం వెనక ఎవరు ఉన్నారు..? కంగనా వ్యాఖ్యలపై రాహుల్ ఫైర్..
- కంగనా ‘‘రైతు చట్టాల’’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైర్..
- ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి..
- రైతులకు వ్యతిరేకంగా కుట్ర చేస్తే అనుమతించడం..
- మళ్లీ ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యం ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంది. అయితే, దీనిపై రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కంగనా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువస్తే ఇండియా కూటమి దీనికి వ్యతిరేకంగా నిలుస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
‘‘బీజేపీ ప్రజల ఆలోచనల్ని పరీక్షిస్తూనే ఉంది. వారు ఒక ఆలోచన అందించి, దానిపై ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తుంది. బీజేపీ ఎంపీల్లో ఒకరు నల్ల చట్టాలైన రైతు చట్టాలను పునరుద్ధరించడం గురించి దీని కోసమే మాట్లాడటం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఉన్నారా లేదా.? అని మోడీజీ స్పష్టం చేయండి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ ఈ రైతు చట్టాలను పునరుద్ధరిస్తారా లేదా..? ఒక వేళ అదే జరిగితే ఇండియా కూటమి మీరు వ్యతిరేకంగా నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను. 700 మంది అమరులయ్యారు, వీరిని గుర్తుంచుకోవాలి, మోడీజీ వారి కోసం రెండు నిమిషాలు మౌనం వహించలేదు. దీనిని ఎప్పటికీ మేము మరిచిపోము’’ అని అన్నారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
Read Also: Rahul Gandhi: కాశ్మీరీ పండిట్లు పాకిస్థాన్ శరణార్థులు? జమ్మూలో రాహుల్ సంచలన వ్యాఖ్య(వీడియో)
‘‘ప్రభుత్వ విధానాలను ఎవరు నిర్ణయిస్తారు..? బీజేపీ ఎంపీ లేదా ప్రధాని మోడీ నా..? 700 మందికి పైగా రైతులు, ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌కి చెందిన వారు బలిదానం చేసినా బీజేపీ సంతృప్తి చెందలేదు’’ అని పోస్టులో పేర్కొన్నారు. మా రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి కుట్ర చేైసినా ఇండియా కూటమి అనుమతించదని, రైతులను దెబ్బతీసేలా ఏదైనా చర్య తీసుకుంటే మరోసారి మోడీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
రైతుల నిరసనల నేపథ్యంలో రద్దు చేసిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఈ చట్టాలను తీసుకురావాలని రైతులే డిమాండ్ చేయాలని, దేశాభివృద్ధికి రైతులే ముఖ్యమని అన్నారు. అయితే, బీజేపీ కంగనా వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పింది. ఈ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!