పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కిన భారీ బడ్జెట్ మూవీ సలార్ ఈరోజు థియేటర్ల లోకి వచ్చేసింది..పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, టీంను ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్ కథాంశంతో తెరకెక్కింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్రశత్రువులుగా ఎలా మారారు అన్నదే ఈ సినిమా కథ. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా…
Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే…
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బుల్లితెర పై స్టార్ మాలో కొనసాగుతున్న ఏకైక షో.. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏడో సీజన్ ను విజయవంతంగా జరుపుకుంటుంది.. ఆ సీజన్ కూడా ఈ వారంతో ముగియ్యనుంది.. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా కామన్ మ్యాన్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు..…
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ.. వికెట్లు తీసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ టోర్నీలో మహ్మద్ షమీ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు. కానీ.. ఫైనల్ మ్యాచ్ లో షమీ ద్వారా అనుకున్న ఫలితం రాకపోవడంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చూపించడంతో టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ.. మహ్మద్ షమీకి అభిమానులలో ఆదరణ ఆకాశాన్ని అంటుతోంది.…
Harish Rao: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇండియన్ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. క్రికెట్ కు రిటైర్డ్ అయిన తర్వాత జనాల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.. ఒకవైపు సినిమాలను కూడా నిర్మిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు.. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు.. అంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నా కూడా అభిమానులతో సొంతం మనిషిలాగ కలిసిపోతాడు.. ఇదిలా ఉండగా ధోనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం…
45 రోజుల పాటు భారత్లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్‌లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌పై దుర్భాషలాడారు. దీంతో.. భారత క్రికెట్ అభిమానులపై విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేపు జరిగే ఫైనల్ పోరు కోసం.. ఇప్పటికే అభిమానులు అహ్మదాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు నుంచి న్యూఢిల్లీ టూ అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో క్రికెట్ అభిమానులకు రైల్వే తరలింపు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త.
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.