Salaar : డార్లింగ్ ఫ్యాన్సా.. మజాకా.. ఈ రేంజ్ హంగామా నెవర్ బిఫోర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కిన భారీ బడ్జెట్ మూవీ సలార్ ఈరోజు థియేటర్ల లోకి వచ్చేసింది..పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, టీంను ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్ కథాంశంతో తెరకెక్కింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్రశత్రువులుగా ఎలా మారారు అన్నదే ఈ సినిమా కథ. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ ప్రభాస్ హీరో అవ్వడంతో సినిమా పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి..
డార్లింగ్ సినిమాను మొదటి రోజే చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు, జనాలు కూడా టికెట్స్ కోసం తెగ కష్ట పడుతున్నారు.. ఇదిలా ఉండగా.. ప్రభాస్ సినిమా వస్తుందంటే హడావిడి ఏ రేంజులో ఉంటుందో ఊహించవచ్చు.. మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని నెవెర్ బిఫోర్ అన్నట్లుగా చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతుంటే.. థియేటర్ వద్ద భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేసి, వాటికీ పూలదండలు, పాలాభిషేకాలు చేయడం, లేదా డీజే బ్యాండ్ తో సందడి చేయడం అందరూ చేసేదే. కానీ ప్రభాస్ అభిమానులు అందుకు బిన్నంగా ట్రెండ్ కు తగ్గట్లు సంధ్య థియేటర్ వద్ద హోరేత్తించారు..
Also Read
సాధారణంగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు లైటింగ్స్, హోర్డింగ్స్, సౌండ్ సిస్టం ఎలా రెడీ చేస్తారో. అలా సిద్ధం చేసి గురువారం రాత్రి నుంచి ప్రీమియర్ షో పడే వరకు ఒక మినీ మ్యూజికల్ కాన్సర్ట్ ని నడిపారు. ప్రభాస్ పాటలతో రెబల్ అభిమానులు సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నేషన్ వైడ్ వైరల్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ సెలబ్రేషన్స్ ని ఇలా కూడా చేస్తారా..? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.. కొందరు మాత్రం ప్రభాసా.. మజాకా.. ఆ మాత్రం ఉంటుంది పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఆ సెలెబ్రేషన్స్ పై ఓ లుక్ వేసుకోండి మరి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..