తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. వ్యామోహాన్నే ప్రేమ అనుకుని దారి తప్పుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక అమ్మాయి కోసం 100 కి.మీ ప్రయాణం చేశాడు.
సోనమ్ రఘువంశీ.. అందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా మరిచిపోయే పని చేసిందా?. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయ తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేసి లోయలో పడేసింది. ఈ ఘటన యావత్తు మహిళా లోకాన్నే కాకుండా.. దేశాన్నే కలవరపాటుకు గురిచేసింది.
భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. ఉరిశిక్ష నిలిపివేతకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వ పెద్దలతో భారత ప్రభుత్వం మంతనాలు చేస్తోంది. ఎలాగైనా ఉరిశిక్షను నిలిపివేసేందుకు భారత్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్.. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గంగా మాత ఆశీస్సులు పొందడానికి వచ్చినట్లు తెలిపారు.
యూపీలోని బరేలీ జిల్లాలో పెళ్లికి కొన్ని రోజుల ముందు ఓ అమ్మాయి తన ఇంట్లో చేసిన పనిపై ఆ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతోంది. రాత్రి వేళ ఆమె చేసిన పనితో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు.
జార్ఖండ్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో హౌరా- ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అయితే.. అదే ట్రాక్ పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి…
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఎంపీడీవో కుటుంబ సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరామర్శించారు.. ఈ సందర్భంగా చంద్రబాబుకి ఫోన్ చేసి వెంకటరమణ భార్యతో కలెక్టర్ మాట్లాడించారు. మిస్సైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.