భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పదంగా మరణించింది. విజయవాడ నగరంలో 37 ఏళ్ళ వివాహిత మెడా పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మరణించింది. భర్త వేధింపులుకు గురి చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు మృతురాలి తల్లి, తమ్ముడు. అదనపు కట్నం,పుట్టింటి ఆస్తులు తన పేరుతో రాయాలని చాలా కాలంగా వేధించాడని పూర్ణిమ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాదాలు జరుగుతున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని స్థితిలో పూర్ణిమా మృతిచెందింది. పూర్ణిమది ముమ్మాటికీ హత్య అని ఆరోపిస్తున్నారు…
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్(35) గురువారం దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహనంపై తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్తుండగా ప్రత్యర్ధులు దారుణంగా హతమార్చారు. ఒకరు తల్వార్.. మరొకరు గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చి అక్కడినించి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న రవినాయక్ మృతదేహాన్ని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. కాగా, హత్యకు పాల్పడ్డ ఇద్దరు అనుమానితులను…
పంజాబ్‌లోని లుథియానాలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. లూథియానాలోని టిబ్బా రోడ్డులో మున్సిపల్ డంప్ యార్డుకు సమీపంలో గల గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు గుడిసెకు నిప్పు అంటుకున్న విషయంపై…