Lalu Family Crisis: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో దుమారానికి కారణమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధిస్తే, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 35 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆర్జేడీ కేవలం 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర…
భార్య కాపురానికి రావడం లేదని.. తల్లిదండ్రులపై కొడుకు కత్తితో దాడి చేసిన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట (మం) బలిజపల్లి పూసల కాలనీలో బుధవారం తెల్లవారుజామున తల్లిదండ్రులపై కుమారుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.
Murder : మేడ్చల్‌లో వరుస హత్య కలకలం రేపుతున్నాయి. నిన్న మేడ్చల్ పట్టణంలోని బస్ డిపో ఎదుట 44వ నెంబర్ జాతీయ రహదారిపై దారుణ హత్య చోటు చేసుకుంది. మేడ్చల్ బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గన్యా కుమారుడు ఉమేష్(30) ను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి హత్య చేశాడు. అయితే.. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంపై విసిగిపోయిన…
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్‌లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.
సెల్ ఫోన్ వాడొద్దని తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పద్మశాలి టౌన్ షిప్‌లో వరుసు రాజు.. భార్య తన ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఆరతి (19) ఈసీఐఎల్‌లోని ఒక కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుంది.
Manchu Vishnu: గత నాలుగు రోజులనుంచి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో తెగ హల్చల్ చేస్తోంది. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి రాగా, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ విడుదలయ్యారు కూడా. ఆ తర్వాత ఈ…