Manchu Vishnu: గత నాలుగు రోజులనుంచి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో తెగ హల్చల్ చేస్తోంది. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి రాగా, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ విడుదలయ్యారు కూడా. ఆ తర్వాత ఈ ఘటనల నేపథ్యంలో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేయి చేసుకున్న సంఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై మోహన్ బాబు మీడియాకు క్షమాపణ తెలియజేశారు. అయితే ఈ వాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే మరోసారి మంచి వారి ఫ్యామిలీలో మరో వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నిన్న రాత్రి మంచు ఇంట్లో జల్‌పల్లిలో మోహన్‌బాబు భార్య బర్త్‌డే పార్టీ జరుగుతుండగా ఒక్కసారిగా కరెంట్ ఆగిపోయింది. ఆ సమయంలో జనరేటర్‌ను ఆన్ చేసి చూసారు మంచు కుటుంబ సభ్యులు . అయితే, ఈ విషయంపై ఉదయం చూడగా జనరేటర్‌లో అన్న మంచు విష్ణు, అలాగే మరి కొందరు పంచదార పోసినట్లు గుర్తించారు. కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పంచదార పోశారని పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు మంచు మనోజ్. ఈ ఫిర్యాదులో తనతోపాటు కుటుంబసభ్యులను కరెంట్ పిక్షన్ చేసి చంపాలని కుట్ర చేసారని, నాతోపాటు భార్య, పిల్లలు, తల్లిని చంపే ప్రయత్నం జరిగిందని, వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశానని, వాళ్లే ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కుట్ర చేశారని ఆయన అన్నారు.