తెలంగాణలో తప్పకుండా 10 స్థానాలకు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల మీడియాతో మాట్లాడారు.
ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందన్నారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనాగా పేర్కొన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నాం అన్నారు.
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్‌సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు విడతల పోలింగ్, కౌంటింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించారు.