EXIT POLLS: మళ్లీ బీజేపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exit Polls Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్‌సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 300 కన్నా అధిక స్థానాలను సాధిస్తున్నట్లు మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సగటున ఏన్డీయేకి 365 సీట్లు, మరోవైపు ఇండియా కూటమి 142 వరకు వస్తాయని అంచనా వేశాయి.
ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని, మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ సారి సొంతంగా బీజేపీకి 370 సీట్లతో పాటు ఎన్డీయే కూటమి 400+ స్థానాల్లో గెలుస్తుందని ‘‘ఔర్ ఏక్ బార్ 400 పార్’’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. రాజ్యాంగాన్ని రక్షించేందుకు, విద్వేష రాజకీయాలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఓటేశారని ధీమా వ్యక్తం చేసింది.
మరోవైపు ఈ రోజు ఇండియా కూటమి ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమయ్యారు. ఇండియా కూటమి 295 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి రాబోతోందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మొత్తం పార్లమెంట్ స్థానాలు: 543, మ్యాజిక్ ఫిగర్: 272
దైనిక్ భాస్కర్:
ఎన్డీయే:281-350
ఇండియా కూటమి: 145-201
ఇతరులు: 33-49
———-
ఇండియా న్యూస్-D-డైనమిక్స్:
ఎన్డీయే: 371
ఇండియా కూటమి: 125
ఇతరులు: 47
————-
జన్ కీ బాత్:
ఎన్డీయే: 362-392
ఇండియా కూటమి: 141-161
ఇతరులు: 10-20
———————–
రిపబ్లిక్ భారత్-మాట్రిక్స్:
ఎన్డీయే: 353-368
ఇండియా కూటమి: 118-133
ఇతరులు: 43-48
———————–
రిపబ్లిక్ టీవీ:
ఎన్డీయే: 359
ఇండియా కూటమి: 154
ఇతరులు: 30
————————
ఎన్డీ టీవీ:
ఎన్డీయే: 365
ఇండియా కూటమి: 142
ఇతరులు: 36
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?