జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్ డ్ కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు శుభవార్త. ఇకపై జేఈఈ మెయిన్‌ను తెలుగు రాసుకునేలాగానే.. ఇకపై జేఈఈ అడ్వాన్స్ డ్‌ను కూడా తెలుగులో రాసుకోవడానికి అవకాశం కలగనుంది.
గ్రూప్-4 పరీక్షకు వేలిముద్రతో హాజరు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) నిర్ణయించింది. గతంలో జరిగిన పరీక్షల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
SPSC పేపర్ లీకేజ్ కేసులో రీమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసామని, ముగ్గురిలో ఇద్దరు TSPSC ఉద్యోగులుని తెలిపింది.
దేశవ్యాప్తంగా 2023-24లో వైద్య విద్యాసంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) మెడికల్ సీట్ల భర్తీకి నేడు నీట్ ప్రవేశపరీక్ష జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు.
రాష్ట్రంలో ఆగస్టులో పోలీసు కొలువులకు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అధికారులు షోడ్యూల్ ప్రకారం ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రామంలో.. ఆగస్టు 7న జరగాల్సిన కమిసన్ కు సంబధించిన అసిస్టెంట్ కమాండెంట్, ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ, ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. కాగా.. ముఖ్యంగా యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రెండేళ్లకోసారి విడుదల చేస్తారు. కాగా.. ఎస్‌ఐ పరీక్షకు ఆప్లై చేసుకున్నవారిలో 20వేలకు పైగా అభ్యర్థులు…
ఏపీ ఎంఈపీసెట్ (ఎంసెట్) షెడ్యూల్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు ఎంఈపీసెట్ పరీక్షలు ఉంటాయని… ఈ నెల 24వ తేదీన ఎంఈపీసెట్ షెడ్యూల్ విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్…