ఏపీ ఎంఈపీసెట్ (ఎంసెట్) షెడ్యూల్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు ఎంఈపీసెట్ పరీక్షలు ఉంటాయని… ఈ నెల 24వ తేదీన ఎంఈపీసెట్ షెడ్యూల్ విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్ లాంటి ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు పరీక్షలు ఉంటాయా ? లేదా ? అనే ప్రశ్న విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది.