TSPSC Remand Report: TSPSC పేపర్ లీకేజ్ కేసులో రీమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అరెస్ట్ చేసామని, ముగ్గురిలో ఇద్దరు TSPSC ఉద్యోగులుని తెలిపింది. ఇప్పటవరకు నలుగురు TSPSC ఉద్యోగుల అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులని, 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రీమాండ్ రీపోర్ట్ లో సిట్ పేర్కొంది. TSPSC ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షి గా పేర్కొన్న సిట్ వెల్లడించింది. శంకర్ లక్ష్మితో పాటు TSPSC , తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొంది. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని సాక్షి గా సిట్ విచారణలో వెలువడింది. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో నిక్షిప్తమైన పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను ఆరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిట్ విచారనలో వెల్లడైంది.
read also: DCP Srinivas: మహేశ్వరం డీసీపీ.. ఏసీపీ కార్యాలయం ప్రారంభం
పేపర్ లీకేజీ నిందితుల పోలీసు కస్టడీ విచారణ గురువారంతో ముగిసింది. అరెస్టయిన సురేష్, రమేష్, షమీలకు ఏప్రిల్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో షమీకి 126, రమేష్ కు 120 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. రాజశేఖర్ రెడ్డి గ్రూప్ 1 పేపర్‌ను షమీకి వాట్సాప్‌లో పంపాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి షమీ ఇంట్లో సిట్ బృందం సోదాలు చేసింది. గ్రూప్-1లో వందకు పైగా మార్కులు వచ్చిన 121 మందిని గుర్తించారు. వారిలో కొందరికి నోటీసులు ఇచ్చారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉన్న సంగతి తెలిసింది. రాజశేఖర్ రెడ్డి బంధువు న్యూజిలాండ్ నుంచి పరీక్ష రాసేందుకు వచ్చినట్లు సిట్ గుర్తించింది..అతనితో పాటు మరికొందరు విదేశాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చినట్లు సమాచారం. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్