Group-4 Exam: నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష జరగనుంది. పరీక్షను ఉదయం.. మధ్యాహ్నం రెండు సెషన్‌లలో నిర్వహించనున్నారు. పరీక్షకు చెప్పులతోనే హాజరు కావాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేయనున్నట్టు ప్రకటించారు. హడావుడి కాకుండా పరీక్షా కేంద్రాలకు త్వరగా చేరుకొని ఒత్తిడికి గురికాకుండా పరీక్షలను రాయాలని కమిషన్ అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 8039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నేడు పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహణ కోసం 2878 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Read also: Bus Catches Fire: రన్నింగ్ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం
గ్రూప్-4 పరీక్షకు టీఎస్‌పీఎస్‌సీ అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు(శనివారం) జరిగే పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులను పరీక్ష హాలులోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలున్న పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపింది. పరీక్షకు 15 నిమిషాల ముందే గేటు మూసివేస్తారని, ఆరు పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేస్తారని వెల్లడించింది. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషన్ పేర్కొన్నది. 8,039 గ్రూప్4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపింది. శుక్రవారం రాత్రి వరకు 9,01,051 మంది అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.
Read also: Today Gold Price: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఏ పరీక్షకు కూడా ఒకరోజు ముందు వరకు 95 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేదని గ్రూప్-4కు మాత్రమే అలా డౌన్‌లోడ్ చేసుకున్నారని వెల్లడించింది. గ్రూప్-4 పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పరీక్ష ఏర్పాట్లు, నిబంధనలు, పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది విధులు తదితర అంశాలపై వివరించారు. పరీక్ష నిర్వహణ కోసం నియమించిన 2,878 లైజన్ ఆఫీసర్లతో కలెక్టర్లు ప్రత్యేకంగా మాట్లాడాలని ఛైర్మన్ సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా సాగే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు.