CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- నిరసనకారులతో మాట్లాడి సంఘీభావం తెలిపిన నేతలు
- రేపు ఉద్ధవ్ ఠాక్రే సందర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమకారులు తమ నిరసన తెలుపుతున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీజేపీ నిరసనకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసనకారులను శరద్ పవార్, సుప్రియా సూలే కలిసి మద్దతు తెలిపారు. రేపు ఉద్ధవ్ ఠాక్రే జంతర్ మంతర్‌ను సందర్శించనున్నారు. సీజేపీ నిరసనకు మద్దతు తెల్పనున్నారు.
సోమవారం సీజేపీ తలపెట్టిన చలో సంసద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. మంగళవారం ప్రతిపక్ష నాయకులతో పాటు కేంద్రమంత్రులు పరామర్శించారు. అయితే ఒక యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ఇదిలా ఉంటే మంగళవారం ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు రాహుల్ గాంధీతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లు ముందు ఉంచారు. హెచ్ఆర్డీ మంత్రి రాజీనామా, సభలో హోం మంత్రి ప్రకటన, సభలో చర్చ, విద్యార్థుల సమస్యలను వినాలి, నిన్నటి హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే సోమవారం ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడానికి భారీ కుట్ర జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయినా పెద్ద ఎత్తున నిరసనకారులు ఎలా రాగలిగారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. కొంతమంది ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సందేశాలు పంపించుకున్నారు. ఒక సందేశంలో ‘‘రేపే మోడీ ప్రభుత్వానికి చివరి రోజు’’ అని ఉంది. మరోవైపు కొందరు నిరసనకారులు ఉద్యమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?