కేంద్రంపై నిందలు వేసి లబ్ధిపొందుతారా..? ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంపై నిందలు వేసి లబ్ధి పొందండం కేసీఆర్‌కు బాగా అలవాటైందని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు కల్లాల్లో రైతులు ధాన్యం పోసి కొనాలంటుంటే యాసంగి వడ్ల పంచాయతీని ముందట వేసుకుని కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక రైతులు అవస్థలు పడుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా పదవులు, దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ప్రజా సంక్షేమం అసరం లేదని ఈటల రాజేందర్ అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదని ఈటల అన్నారు. ఇప్పటికైనా రైతుల ధాన్యాన్ని కొనాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలను సైతం ప్రభుత్వం తగినన్ని ఏర్పాటు చేయలేదని ఆయన మండిపడ్డారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్‌పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
- Tags
- bjp
- Etala Rajender
- Farmers
- kcr
- TRS
తాజావార్తలు
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!