BRS Ministers: హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశమని.. రామాయణం రాసిన వాల్మీకిది వరంగల్ ప్రాంతమేనని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. వాల్మీకికి గొప్ప గుర్తింపు తీసుకు వచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే దేవాలయాల అభివృద్ధి చేస్తోందన్నారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశం ఇది బమ్మెర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
రామప్పకు యునెస్కోకు గుర్తింపు వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. కేంద్రం ఇప్పటికైనా గుర్తించి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. 22 అడుగుల వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బమ్మెర పోతన స్వగ్రామం బమ్మెరలో కళ్యాణ మండపం, హరిత హోటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురాతన ఆలయాలను చారిత్రాత్మకమైన ప్రదేశాలను వందల కోట్లు సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో వెయ్యి గ్రామాలకు అవార్డులు రాబోతున్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
Read Also: Tragic Incident: ఇంటిపై ఉన్న బండరాయిని కదిలించిన కోతులు.. మూడేళ్ల చిన్నారి మృతి
వరంగల్ అంటేనే కళలకు పుట్టిన ఇల్లు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక్కడ అనేకమైన యునెస్కో అవార్డులు వచ్చే కట్టడాలు ఇక్కడ ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గుర్తింపు లేకుండా పోయిందని.. అప్పుడే గుర్తింపు ఇచ్చి ఉంటే ఇంకా పర్యాటక శాఖ అభివృద్ధి జరిగేదన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృషితో అవార్డులు వస్తున్నాయన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం రామప్పలో జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. మన కళలను, కవులను ఎవరు గుర్తించలేదని.. ఎన్నడైనా మన రాష్ట్రానికి ఇన్ని అవార్డులు వచ్చాయా అంటూ మంత్రి ప్రశ్నించారు. కేంద్రం సహకరించక పోయినా కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి సాధిస్తున్నామన్నారు. కేంద్రం అడ్డుకోవాలని చూసినా అనేక అవార్డులు వచ్చాయని ఆయన ఆరోపించారు. అడ్డుకోకుంటే ఇంకా అనేక అవార్డులు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందుతుందని.. వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వరంగల్‌లో ప్రతి నెలలో ఒక్కో సాంస్కృతిక కార్యక్రమం, క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. ప్రతి నెల ఒక ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. 33 జిల్లాల్లో సమ్మర్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 17000 గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే క్రీడా కీట్లు కూడ అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు.
Read Also: Ys Viveka Case Live: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
రామప్ప అభివృద్ధికి కేంద్రం 500 కోట్లు ఇవ్వచ్చు కానీ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చాము అని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్రం, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి సహకరించడం లేదని మంత్రి ఆరోపించారు. వరంగల్ మీద ఉన్న అభిమానంతోనే వారసత్వ ఉత్సవాలను వరంగల్‌లో సీఎం కేసీఆర్ ఘనంగా చేస్తున్నారని.. ప్రత్యేక నిధులు ఇచ్చి ఈ వేడుకను ప్రభుత్వం గొప్పగా చేస్తోందన్నారు. గతంలో ఈ వేడుకలు కేవలం మొక్కుబడి కార్యక్రమంగా సాగేదని కానీ ఇప్పుడు మారిందన్నారు. వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భవిష్యత్‌లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రత్యేక ప్రణాళికతో ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.