Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్స్టీన్’’ ఫైల్స్పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్లు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు అన్ని నిజాలు బయటపడుతాయని ట్రంప్ అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన ఓటింగ్లో బిల్లుకు 427 మంది అనుకూలంగా, ఒక్కరు వ్యతిరేకంగా ఓటేశారు.
Epstein Files: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల తలెత్తిన విభేదాలు సంచలనంగా మారాయి. వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చని ‘‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’’పై ట్రంప్ తన అసంతృప్తిని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశాడు.
Trump-Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత సాయం చేశారో అందరికీ తెలిసింది. అయితే, గెలిచిన తర్వాత ట్రంప్ కి అత్యంత సన్నిహితుడిగా మారిన మస్క్ డోజీ ద్వారా ఖర్చులు తగ్గించేందుకు కీలకంగా పని చేశారు. కానీ, ప్రస్తుతం ట్రంప్ తీసుకొస్తున్న బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వీరి మధ్య దోస్తాన్ కి బీటలువార్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. గత కొంత కాలంగా ట్రంప్ ప్రభుత్వంపై మస్క్ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణంలో ప్రముఖుల పేర్లు వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. యుక్త వయసులోని బాలికకు డబ్బు ఎరవేసి సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహించినట్లు జెఫ్రీ ఎప్స్టీన్, అతని సహచరుడు మాక్స్ వెల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2002-2005 మధ్య ఎప్స్టీన్ ఫ్లోరిడాలోని తన ఇంటికి ఇలా యువతులను ఆహ్వానించి వారిపై లైంగిక దోపిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Jeffrey Epstein Files: జెఫ్రీ ఎప్స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతున్నాయి. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా మూడో బ్యాచ్ అన్సీల్డ్ డాక్యుమెంట్లు నిన్న విడుదలయ్యాయి.