హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా స్కూల్ టీచర్‌గా మారిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే.. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు నిర్మలా సీతారామన్.. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్న నిర్మలా సీతారామన్.. మొక్కల విశిష్టత - ఉపయోగాలు అంశంపై విద్యార్థులకు వివరించారు..
నేడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మరోసారి సనాతన ధర్మం ప్రత్యేకతను ప్రజలతో పంచుకున్నారు. పూర్వీకులు చెట్లను, నదులను పూజించేవాళ్ళని గుర్తు చేశారు. సనాతనధర్మం ఒక మతోన్మాదం కాదని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan: ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి ప్రకృతిలో ఆకృతి తొడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయం.. దేవి నవరాత్రులతో ఆరంభమయ్యే బతుకమ్మల పూజలు, ఆటలు నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్న తరుణంలో నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పేర్కొన్నారు.
Karnataka: ప్రకృతిని మనం ప్రేమిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అయితే మనలో ప్రకృతిని ప్రేమించే వాళ్లకన్నా పాడుచేసే వల్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ప్రకృతిని ప్రాణాపధంలా చూసుకుంటారు. నిత్యా ఆరాధన చేస్తూ వాళ్ళ జీవితంలో ప్రకృతిని ఓ భాగంగ చేసుకుని ప్రకృతితో మమేకమై పోతారు. అలా ప్రకృతిని సంరక్షిస్తూ ఏళ్ళ తరబడి వందల మొక్కలను నాటారు ఓ పర్యావరణవేత్త. ఫక్కిరేశ హురులికొప్పి అనే వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే మొదటి సేవ…
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. వాతావరణంలో మారుతున్న మార్పుల కారణంగా మానవ జీవన ప్రమాణం తగ్గిపోతుంది.
ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో.. ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న టైంకి చేరుకోవచ్చని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఒక లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ లో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూలై 1 నుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను వినియోగించరాదు. ఒకవేళ కేంద్రం నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా…