ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో.. ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న టైంకి చేరుకోవచ్చని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో భారతదేశం తరపున పాల్గొనడం గర్వంగా ఉందని.. కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోడీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతో పాటు ముందుండి విజయవంతంగా నడిపామని ఆయన అన్నారు.
Read Also: MLC Kavitha: అసెంబ్లీ ఎన్నికల బరిలో కల్వకుంట్ల కవిత..? నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ..!
జీ-20 ప్రెసిడెన్సీ ద్వారా పర్యాటక వర్కింగ్ గ్రూపు సమావేశాల నిర్వహణతో పాటుగా గోవాలో గత నెలలో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ఏకగ్రీవంగా ‘గోవా రోడ్ మ్యాప్’కు ఆమోదం తెలిపిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ గోవా రోడ్ మ్యాప్‌లో.. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, స్కిల్స్, టూరిజం MSMEs, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్ అనే ఐదు కీలకమైన అంశాలపై ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
Read Also: Vijay Deverakonda: ఆ విషయంలో చిరు, పవన్‌లను వెనక్కి నెట్టి నెంబర్1గా దేవరకొండ!
భారత ప్రభుత్వం రూపొందించిన నూతన జాతీయ పర్యాటక విధానంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సరైన ప్రాధాన్యత కల్పించామని కేంద్రమంద్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్‌తో పాటు ప్రపంచ పర్యాటకానికి కూడా ఎంతో సానుకూల ఫలితాలను వస్తున్నాయని తెలిపారు. ప్రకృతితో అనుసంధానమైన జీవన విధానం వంటివి భారత్ లో పర్యాటకాభివృద్దికి సానుకూలమైన అంశాలన్నారు. భారతదేశ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద, యోగ, నేచురోపతి వంటివన్నీ.. ప్రకృతితో మమేకమై జీవించాలన్న ఆలోచనను ప్రతిబింబిస్తాయని కిషన్ రెడ్డి చెప్పారు. ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే భారతీయ జీవన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని.. రానున్న రోజుల్లో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Health Benefits: కిస్ మిస్ తినకపోతే.. ఈ లాభాలు మిస్ అయినట్టే..!
ప్రధాని మోడీ ఇటీవలే.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా జీవనవిధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో.. ‘యువ టూరిజం క్లబ్’లను ఏర్పాటు చేశామన్నారు. తర్వాతి తరం అయిన భారత పౌరుల్లో పర్యాటక, పర్యావరణ స్పృహను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ క్లబ్స్ ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2030 నాటికి పూర్తిచేసేలా నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. పర్యాటక రంగ సుస్థిరత, సమగ్రత లక్ష్యాల ప్రాధాన్యతతో భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసేందుకు ‘మీరంతా భారత్ కు రండి’ అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారిని ఆహ్వానించారు.