Karnataka: ప్రకృతిని మనం ప్రేమిస్తే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. అయితే మనలో ప్రకృతిని ప్రేమించే వాళ్లకన్నా పాడుచేసే వల్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం ప్రకృతిని ప్రాణాపధంలా చూసుకుంటారు. నిత్యా ఆరాధన చేస్తూ వాళ్ళ జీవితంలో ప్రకృతిని ఓ భాగంగ చేసుకుని ప్రకృతితో మమేకమై పోతారు. అలా ప్రకృతిని సంరక్షిస్తూ ఏళ్ళ తరబడి వందల మొక్కలను నాటారు ఓ పర్యావరణవేత్త. ఫక్కిరేశ హురులికొప్పి అనే వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే మొదటి సేవ ప్రకృతికి చేసి ఆ తరువాతే తన పనులు చూసుకుంటున్నారు. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం లోని హావేరి జిల్లా లోని బాడగి తాలూకా నజీకలకామాపుర గ్రామంలో ఫక్కిరేశ హురులికొప్పి అనే వ్యక్తి గత 7 సంవత్సరాలుగా ప్రకృతిని ఆరాధిస్తున్నారు. 7 సంవత్సరాల్లో 350 చెట్లను నాటారు. అతను చదువుకున్న పాఠశాల లోనే దాదాపు 300 చెట్లను నాటారు. చెట్లను నాటి నా పని అయిపోయింది అనుకోలేదు.
Read also:Guntur Kaaaram: మహేష్ మసాలా దమ్ము చూద్దురు.. గెట్ రెడీ !
నిత్యం వాటికి నీళ్లను అందిస్తూ చెట్ల చుట్టూ ఉన్న చెత్తను తొలిగిస్తూ మొక్కలను తన సొంత పిల్లలను చూసుకున్నట్లు చూసుకుంటున్నారు. కాగా ఈ విషయం పైన ఫక్కిరేశ మాట్లాడుతూ.. ప్రస్తుతం మనలో పెరిగిన స్వార్ధం వల్ల అడవులు అంతరించి పోతున్నాయి. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత.. లేనిపోని సమస్యలు ఏర్పడుతున్నాయి.. పర్యావరణ అసమతుల్యత అతివృష్టికి, అనావృష్టి దారితీస్తూ కరువులు సంభవిస్తునాయి.. అందుకే పర్యావరణాన సంరక్షణలో నావంతు బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఒక్కమొక్క నాటిన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చనునని పేర్కొన్నారు. కాగా ఇలాంటి వ్యక్తి తమ పాఠశాలలో చదివినందుకు చాల గర్వపడుతున్నాం అని అభినందిచారు పాఠశాల ఉపాధ్యాయులు. కాగా ఫక్కిరేశ ప్రయివేట్ ఉద్యోగం చేస్తుంటారు. తాను ఎంత బిజీగా ఉన్న ప్రతి రోజు ఉదయం 6 గంటలనుండి 9 గంటలవరకు పర్యావరణ పరిరక్షణ పనులు చేస్తారు. ఆతరువాత యథావిధిగా తన పనిని చూసుకుంటారు.ఇలా అతను గత ఏడేళ్లుగా చేస్తున్నాడు.