ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరు అయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా., ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. నేడు ఆదివారం కావడంతో సరదాగా బీచ్ కు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో…
తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా తన ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతకంగా చంపేశాడు. ఆ వ్యక్తి ఇదివరకే ఓ కూతుర్ని చంపి జైలు నుంచి బయటకు వచ్చాడు. బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇదు మియాన్, అతని భార్య అఫ్రీన్ ఖాతున్. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్ (12), షెహ్బాజ్ ఖతున్ (9).…
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఊరుకుంటారా? దాంతో సెల్ఫీనో లేకపోతే రీల్స్ చేయడమో చేస్తుంటారు. అలా చేసిన వాటితో కొందరు పాపులర్ అవుతారు.. మరికొందరు వాటితో చిక్కుల్లో పడతారు.
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు. రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్…
మొన్న తెలుగు పేపరు … నిన్న హిందీ … ఇవాళ ఇంగ్లీష్ పేపర్ లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం సత్యసాయి జిల్లాకు ప్రాకింది.తాజాగా ఆమడగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. అప్రమత్తం అయిన జిల్లా అధికారుల ఘటన పై విచారణకు ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆమడగూరులో 10గంటల సమయంలో పదవ తరగతి ఇంగ్లీష్ పేపర్ స్థానిక వాట్సప్ గ్రూపులో చక్కర్లు కొట్టింది.స్థానికంగా పేపర్ లీక్ అయిందన్న…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. అక్కడ డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అప్రమత్తం అయిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఏం జరుగుతుందనే దానిపై ప్రజలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ పబ్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు తమ దూకుడు పెంచారు. మరో ముగ్గురిని నేడు విచారించనున్నారు బంజారాహిల్స్ పోలీసులు. నిన్న టోనీ కేసులో నిందితులు శశికాంత్, సంజయ్ లను దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. డ్రగ్స్…